అప్పటిదాకా తలపాగా ధరించను: సచిన్ పైలట్
- రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తర్వాతే తలపాగా ధరిస్తా
- విజయాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థించా
- ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలవలేకపోవడం బాధించింది
2014 ఎన్నికల్లో ఒక్క లోక్ సభ స్థానంలో కూడా కాంగ్రెస్ గెలవకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకే ఈ శపథం అని చెప్పారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని దేవుడిని ప్రార్థించానని... విజయం సాధించిన తర్వాతే తాను రాజస్థానీ తలపాగాను ధరిస్తానని తెలిపారు.