'గోద్రా రైలు దహనం' దోషులలో 11 మంది మరణశిక్షను జీవితఖైదుగా మార్చిన హైకోర్టు!
- కీలక తీర్పును ఇచ్చిన గుజరాత్ హైకోర్టు
- ఫిబ్రవరి 27, 2002న ఘటన
- సబర్మతీ రైలు కోచ్ ని దగ్ధం చేసిన దోషులు
- 59 మంది మృతి, ఆపై మత కలహాలు
- దోషుల అపీలు తరువాత కింది కోర్టు తీర్పును సవరించిన హైకోర్టు
ఈ ఘటనలో మొత్తం 94 మంది నిందితులైన ముస్లింలపై కేసులు నమోదు చేసిన ప్రత్యేక దర్యాఫ్తు బృందం వారిపై చార్జ్ షీట్ లను దాఖలు చేసింది. కేసు విచారణ సుదీర్ఘకాలం సాగగా, నిందితుల్లో 63 మందిపై సాక్ష్యాలు లేని కారణంగా ఆరోపణలను కొట్టేసిన సిట్ కోర్టు, మిగిలిన 31 మందిని నేరస్తులుగా నిర్థారించి, వారిలో 11 మందికి మరణశిక్ష, మిగిలినవారికి జీవిత ఖైదును విధించింది. మరణశిక్ష పడిన వారు అపీలు చేసుకోగా, విచారించిన హైకోర్టు, వారి శిక్షను కూడా జీవిత ఖైదుగా మారుస్తూ కొద్దిసేపటిక్రితం తీర్పిచ్చింది.