ప్రత్యేకత చాటుకున్న రాష్ట్రపతి.. వర్షంలో తడుస్తూనే గౌరవ వందనం స్వీకరించిన కోవింద్
- కేరళలో తొలిసారి పర్యటించిన ప్రథమ పౌరుడు
- వర్షం పడుతున్నా గొడుగును నిరాకరించిన కోవింద్
- ఆశ్చర్యపోయిన ముఖ్యమంత్రి, అధికారులు
దీంతో భద్రతాధికారులు ఆయనకు గొడుగు పట్టేందుకు ప్రయత్నించగా కోవింద్ సున్నితంగా తిరస్కరించారు. వర్షంలో తడుస్తూనే తనకు సమర్పించిన గార్డ్ ఆఫ్ ఆనర్‌ను అందుకున్నారు. అనంతరం మాతా అమృతానందమయి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ చారిటీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హెలికాప్టర్‌లో కొల్లాం వెళ్లారు. రాష్ట్రపతి వర్షంలో తడుస్తూనే గౌరవ వందనాన్ని స్వీకరించడం చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. ఆయన హుందాతనాన్ని కొనియాడు.