koun banega karodpati: 'వైఎస్ఆర్' అంటే ఏంటో చెప్పలేక తడబడిన పీవీ సింధు!

  • అమితాబ్ తో కలసి కేబీసీ ఆడిన సింధు
  • 13వ ప్రశ్నగా వైఎస్ఆర్ అంటే ఏంటని అడిగిన బిగ్ బీ
  • తొలుత 'ఎడుగూరి సంధింటి రాజశేఖర' అన్న సింధు
  • ఆపై చెల్లెలి సాయంతో సరైన సమాధానం

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధును హాట్ సీట్ లో కూర్చోబెట్టిన అమితాబ్, 'కౌన్ బనేగా కరోడ్ పతి' ఆడించిన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. 12 ప్రశ్నలను దాటుకుని రూ. 12.5 లక్షలు గెలుచుకున్న తరువాత, రూ. 25 లక్షలను అందించే 13వ ప్రశ్నకు సింధు తడబడింది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 'వైఎస్ఆర్' అంటే ఏంటన్నదే ఆ ప్రశ్న. దీనికి నాలుగు ఆప్షన్స్ ఇస్తూ, ఎ) యువ సత్య రాజ్యం, బి) ఎడుగూరి సంధింటి రాజశేఖర, సి) యూత్ షల్ రూల్, డి) యువజన శ్రామిక రైతు... అంటూ ఆప్షన్స్ ఇచ్చారు.

దీనికి కొద్దిసేపు ఆలోచించిన సింధూ, తన తండ్రి వైఎస్ఆర్ పేరిట ఈ పార్టీని జగన్ స్థాపించి ఉంటారన్న ఉద్దేశంతో 'బీ' ఆప్షన్ ను ఎంచుకుంది. ఆపై అమితాబ్, బాగా ఆలోచించి చెప్పాలని సలహా ఇవ్వగా, తన చెల్లెలు సాయం తీసుకున్న ఆమె, సరైన సమాధానమైన 'యువజన శ్రామిక రైతు' అన్న ఆప్షన్ ను ఎంచుకుని రూ. 25 లక్షలను తన ఖాతాలో వేసుకుని, ఆపై హాట్ సీట్ ను వదిలింది.

More Telugu News