maruthi: నెక్స్ట్ మూవీ చైతూతో.. తర్వాత బన్నీతో .. ఆ తరువాత ప్రభాస్ తో చేస్తా!: మారుతి

  • మారుతి నెక్స్ట్ మూవీ నాగచైతన్యతో
  • వచ్చేనెలలో సెట్స్ పైకి
  • ఆ తరువాత ఆయన చేయాలనుకుంటోన్న హీరో బన్నీ
  • ప్రభాస్ కోసం కూడా కథ రెడీ చేస్తానంటోన్న మారుతి       

'మహానుభావుడు' సినిమాతో హిట్ కొట్టిన మారుతి, తరువాత సినిమాను నాగచైతన్యతో ప్లాన్ చేసుకున్నాడు. వచ్చేనెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ, ఈ సినిమాకి 'మంచోడు' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదని చెప్పాడు.

 ఈ ప్రాజెక్టు తరువాత బన్నీతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాననీ, ఆయన కోసం ఓ స్టోరీ లైన్ అనుకున్నానని అన్నాడు. త్వరలోనే బన్నీకి ఆ లైన్ చెబుతాననీ .. ఆయనకి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉందని చెప్పాడు. ఆ తరువాత సినిమా ప్రభాస్ తో చేయాలని ఉందనీ, ఆయన క్రేజ్ కి తగిన కథను సిద్ధం చేసుకోవలసి ఉందని అన్నాడు. 

More Telugu News