pixel 2: పిక్సెల్ 2 ఫోన్లలో హెడ్‌ఫోన్ జాక్ లోపించ‌డంపై స‌మాధానం చెప్పిన గూగుల్‌

  • ఆపిల్‌ను అనుక‌రించింద‌ని ఆరోప‌ణ‌లు
  • సాంకేతిక ప్ర‌మాణాల అమ‌లు కోస‌మని సంజాయిషీ
  • ప్రత్యేక అడాప్ట‌ర్ త‌యారుచేసే ఉద్దేశం

గ‌తేడాది ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్ల‌స్ స్మార్ట్ ఫోన్ల నుంచి హెడ్‌ఫోన్ జాక్‌ను తొల‌గించ‌డంపై ఆపిల్ సంస్థ‌ను గూగుల్ ఎద్దేవా చేసింది. అలాంటిది గూగుల్ అక్టోబ‌ర్ 4న విడుదల చేసిన త‌మ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ ఫోన్ల‌ను హెడ్‌ఫోన్ జాక్ లేకుండా విడుద‌ల చేసింది. ఈ విష‌యాన్ని పిక్సెల్ ఆవిష్క‌ర‌ణ స‌మ‌యంలో వెల్ల‌డించ‌లేదు. ఈ మోడ‌ల్‌ను కొనుగోలు చేసిన వారు హెడ్‌ఫోన్ జాక్ లేని విష‌యాన్ని గుర్తించారు. దీనిపై గ్యాడ్జెట్ గురులు మండిప‌డ్డారు.

ఆపిల్‌ను అనుక‌రించిందంటూ కామెంట్లు చేశారు. ఒక‌ప్పుడు ఎద్దేవా చేసి ఇప్పుడు దానిని అనుక‌రించ‌డం ఎందుక‌ని నిల‌దీశారు. దీనికి గూగుల్ స‌మాధానం చెప్పింది. `పిక్సెల్ 2కి హెడ్‌ఫోన్ సౌక‌ర్యం ఉంది. కాకపోతే హెడ్‌సెట్‌ని కూడా యూఎస్‌బీ పోర్ట్‌లోనే క‌నెక్ట్ చేసుకోవాలి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్ర‌మాణాల‌ను అమ‌లు చేయ‌డానికే ఈ మార్పు తీసుకువ‌చ్చాం` అని తెలిపింది.

పిక్సెల్ ఫోన్ల‌లో యూఎస్‌బీ క‌నెక్ట‌బిలిటీని స‌పోర్ట్ చేసే హెడ్‌ఫోన్ల జాబితాను కూడా గూగుల్ ప్ర‌క‌టించింది. అంతేకాకుండా మామూలు హెడ్‌ఫోన్ల‌ను, యూఎస్‌బీ క‌నెక్ట‌బిలిటీ హెడ్‌ఫోన్లుగా మార్చే ప్ర‌త్యేక అడాప్ట‌ర్‌ని కూడా త‌యారు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు గూగుల్ ప్ర‌క‌టించింది.

More Telugu News