smith: ఇంటికి పయనం కానున్న ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్

  • స్టీవ్ స్మిత్ భుజానికి గాయం
  • గాయం పెద్ద‌దేమీకాకపోయినా టీ20 సిరీస్ కు దూరం
  • ప్రకటన విడుదల చేసిన ఆస్ట్రేలియా టీమ్
  • స్మిత్ స్థానంలో కెప్టెన్ గా డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ మొన్న ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండ‌గా గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యులు గాయం పెద్ద‌దేమీకాద‌ని చెప్పిన‌ప్ప‌టికీ, ఆయ‌న టీమిండియాతో టీ20 సిరీస్ ఆడ‌ర‌ని టీమ్ మేనేజ్‌మెంట్ ఈ రోజు ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఆయ‌న త్వ‌ర‌లోనే ఇంటికి ప‌య‌నం కానున్నాడు. స్మిత్ స్థానంలో వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సారథ్య‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడని తెలిపింది.

ఇటీవ‌ల టీమిండియాతో నాగ్‌పూర్‌లో జ‌రిగిన ఐదో వ‌న్డే మ్యాచ్‌లోనూ స్మిత్ భుజం నొప్పితో బాధ‌ప‌డ్డాడని పేర్కొంది. ఇక‌, టీమిండియాతో జ‌ర‌గ‌నున్న మూడు టీ20ల్లో స్మిత్ స్థానంలో ఆల్‌రౌండర్ మార్క‌స్‌ స్టొయినిస్‌ను బ్యాటింగ్‌కు దింపుతామ‌ని చెప్పింది. టీమిండియా టూర్ త‌రువాత త‌మ టీమ్ ఇంగ్లండ్‌తో ఆడ‌నున్న సిరీస్ దృష్ట్యా స్మిత్‌కి విశ్రాంతి ఇస్తున్న‌ట్లు పేర్కొంది.

More Telugu News