తన భర్త, కుమార్తెల గురించి శైలజా కిరణ్ స్పందన!
- నా భర్త వ్యక్తిత్వం చాలా గొప్పది
- ప్రతి ఒక్కరిని 'మీరు' అనే సంబోధిస్తారు
- మీకు లక్ష్మి, సరస్వతి, పార్వతిలు పుట్టారని అందరూ అంటుంటారు
- సుమన్ మరణం బాధాకరం
తన మరిది సుమన్ చనిపోవడం తమకు ఎంతో బాధను కలిగించిందని చెప్పారు. ఆయన మరణంతో తమ కుటుంబంలో ఒక విధమైన నిశ్శబ్ద వాతావరణం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమన్ చాలా మంచి వ్యక్తి అని... పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడు వారితో ఆడుతూ, పాలు కూడా పట్టేవారని గుర్తు చేసుకున్నారు.
ఆరోగ్యానికి తాను చాలా ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు. గత ఐదేళ్లుగా మంచి డైట్ పాటిస్తున్నానని, పోషకాహారాలు, కాయగూరలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటున్నానని తెలిపారు. గత పదేళ్ల నుంచి వర్కౌట్లను కూడా రెగ్యులర్ గా చేస్తున్నానని చెప్పారు.