mahesh babu: 'స్పైడర్' పంపిణీ దారులకి భారీ నష్టం తప్పదట!

  • 124 కోట్ల బిజినెస్ చేసిన 'స్పైడర్' 
  •  తొలి వారాంతంలో 45 కోట్ల వసూళ్లు
  •  మొత్తం వసూళ్లు 55 కోట్లుగా వుండే అవకాశం
  •  నష్టాలు తప్పవంటోన్న విశ్లేషకులు  

దసరా పండగ సందర్భాన్ని పురస్కరించుకుని 'స్పైడర్' మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే రోజున ఈ సినిమా తమిళ ప్రేక్షకులను కూడా పలకరించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. కానీ ఆ తరువాత చాలా వేగంగా ఈ సినిమా వసూళ్లు పడిపోతూ వచ్చాయి. దాంతో పంపిణీ దారులకు భారీ నష్టాలు తప్పవనేది ట్రేడ్ వర్గాల మాట.

 దాదాపు ఈ సినిమా 124 కోట్ల మేర బిజినెస్ జరుపుకుంది. తొలి వారాంతంలో 45 కోట్ల షేర్ ను మాత్రమే వసూలు చేసింది. రెండోవారం .. మూడోవారంలోను కలుపుకుని ఈ సినిమా మరో 10 కోట్ల వరకూ వసూలు చేయవచ్చని అంటున్నారు. ఆ విధంగా ఈ సినిమా మొత్తం వసూళ్లు 55 కోట్ల షేర్ మాత్రమే వుండే అవకాశం ఉందనేది ట్రేడ్ అనలిస్టుల విశ్లేషణ. స్టార్ హీరోలకి అప్పుడప్పుడు ఇలాంటి పరాజయాలు ఎదురుకావడం సహజమేననే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.   

More Telugu News