విద్యార్థితో కలసి ఢిల్లీ వెళ్తున్న మహిళా టీచర్ ను భోపాల్ లో పట్టుకున్న పోలీసులు!
- ఇంట్లో చెప్పకుండా 9వ తరగతి విద్యార్థిని ఢిల్లీ తీసుకెళ్తున్న మహిళా టీచర్
- రోజంతా వెతికి పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లిదండ్రులు
- సీసీ పుటేజ్ తో కేసు ఛేదించిన పోలీసులు
పిల్లాడి కోసం రోజంతా ఎదురు చూసిన తల్లిదండ్రులు కర్నూలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు, మహిళా టీచర్ తో కలిసి వెళ్తున్న బాలుడ్ని గుర్తించారు. వారిద్దరూ హైదరాబాదు రైల్వే స్టేషన్ లో ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఎక్కినట్టు గుర్తించారు. దీంతో భోపాల్ పోలీసులను సంప్రదించి, వారిని అక్కడ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, ఢిల్లీ చూసేందుకు వెళ్తున్నామని తెలిపారు. దీంతో వారిద్దరి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భోపాల్ వెళ్లి వారిని తీసుకొచ్చారు.