ఎన్టీఆర్ బయోపిక్ గురించి బాలకృష్ణ నన్ను పిలిపించింది నిజమే!: తేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ బయోపిక్ గురించి బాలకృష్ణ నన్ను పిలిపించింది నిజమే!: తేజ

  • ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించే పనుల్లో బాలకృష్ణ
  • ఈ విషయంపై మాట్లాడటానికి దర్శకుడు తేజను పిలిపించాడంటూ     వార్తలు
  • అది నిజమేనని చెప్పిన తేజ
  • ఈ బయోపిక్ ను తాను తెరకెక్కించే ఛాన్స్ ఉందని వెల్లడి   
ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కించే పనిలో బాలకృష్ణ వున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ఆయనే పోషించనున్నట్టు చెప్పారు కూడా. ఈ ప్రాజెక్టును ఏ దర్శకుడి చేతిలో పెడదామా అనే విషయంలో ఆలోచనలో పడిన బాలకృష్ణ, దర్శకుడు తేజను పిలిపించి మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. రాజకీయాల నేపథ్యంలో ఆయన 'నేనే రాజు నేనే మంత్రి' తెరకెక్కించిన తీరు నచ్చడంతో, బాలకృష్ణ పిలిపించి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారని చెప్పుకున్నారు.

అది నిజమేనన్న విషయాన్ని తాజాగా తేజ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు గురించి బాలకృష్ణ ఓ నాలుగైదు సార్లు తనని పిలిచి మాట్లాడారని ఓ ఆంగ్ల దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ఎన్టీఆర్ కి వీరాభిమానిననీ .. అయితే ఆయన చరిత్రను తెరకెక్కించాలంటే కొంత టెన్షన్ పడటం సహజమేనని అన్నారు. మొత్తానికి తాను ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు.    
teja

More Telugu News