అమెరికా: ఐఎస్‌ఐకి ఉగ్రవాద సంస్థలతో నేరుగా సంబంధాలున్నాయి: అమెరికా

  • పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఉగ్రవాదులను వదిలిపెట్టిన ఘ‌టనలు ఉన్నాయి
  • పాకిస్థాన్ తీరును మార్చేందుకు పలుసార్లు ప్రయత్నించాం
  • ఐఎస్‌ఐకి ప్రత్యేక విదేశాంగ విధానం సైతం ఉంది

ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తోన్న పాకిస్థాన్‌పై అమెరికా మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు ఉగ్రవాద సంస్థలతో నేరుగా సంబంధాలున్నాయని తేల్చి చెప్పింది. తాజాగా అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్స్‌ చైర్మన్‌ జనరల్‌ జోసెఫ్‌ డన్‌ఫోర్డ్ మీడియాతో మాట్లాడుతూ... పాకిస్థాన్ తీరును మార్చేందుకు అమెరికా పలుసార్లు ప్రయత్నించిందని, కానీ అది ప్ర‌తిఫ‌లించ‌లేద‌ని చెప్పారు.

అక్కడి ప్రభుత్వ పెద్దలు ఒకలా ప‌ని చేస్తోంటే, నిఘా సంస్థ మాత్రం మ‌రోలా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. అంతేగాక‌, ఐఎస్‌ఐకి అక్క‌డి ప్ర‌భుత్వంతో సంబంధం లేకుండా ప్రత్యేక విదేశాంగ విధానం ఉందని కూడా అన్నారు. పాక్‌ను మార్చేందుకు మరో మార్గం ఉందని తాను అనుకోవడం లేదని తెలిపారు. పాకిస్థాన్‌ స్వయంగా ఉగ్రవాదులను వదిలిపెట్టిన ఘ‌టనలు ఉన్నాయ‌ని చెప్పారు. 

More Telugu News