rohit sharma: డేటింగ్ కు ఎవరు కావాలని చాహాల్, కులదీప్ లను ప్రశ్నించిన రోహిత్ శర్మ... సమాధానాలివి!

  • ఇటీవలి కాలంలో స్టార్ ఆటగాళ్లుగా మారిన చాహాల్, కులదీప్
  • ఇంటర్వ్యూ చేస్తూ తమాషా పట్టించిన రోహిత్ శర్మ
  • కత్రినా పేరు చెప్పిన చాహాల్, జాక్వలిన్ అన్న కులదీప్

యజువేంద్ర చాహాల్, కులదీప్ యాదవ్... ఇటీవలి కాలంలో భారత జట్టులో స్టార్ ఆటగాళ్లుగా మారిపోయి, అతికొద్ది కాలంలోనే అపారమైన అభిమానులను సంపాదించుకున్న యువ ఆటగాళ్లు. ఇప్పుడు వీరిద్దరినీ మరో క్రికెటర్ రోహిత్ శర్మ ఇంటర్వ్యూ చేస్తూ పలు ఆసక్తికర ప్రశ్నలను అడుగగా, ఆ వీడియోను బీసీసీఐ షేర్ చేసుకుంది. మహిళాభిమానులు పెరుగుతూ ఉన్న ఈ తరుణంలో ఎవరైనా మాటలు కలిపితే ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు, తనకు కనీసం ఐదారేళ్లుగా పరిచయం ఉన్న అమ్మాయి అయితేనే తాను మాట్లాడతానని, లేకుంటే, నా నోట మాటరాదని యజువేంద్ర చాహాల్ చెప్పాడు.

ఇక ఇదే ప్రశ్నకు తాను మాటకారిని కాదని, సిగ్గు ఎక్కువని, ఒకటి రెండు మాటలతోనే సరిపెడతానని కులదీప్ చెప్పాడు. ఎవరితో డేటింగ్ కావాలని అడిగితే చాహాల్ కత్రినా కైఫ్ పేరును, కులదీప్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ పేరును చెప్పారు. ఏ కారు కావాలని అడిగితే, సెకండ్ హ్యాండ్ అయినా 'పోర్స్చ్' కావాలని చాహాల్, 'ముస్తాంగ్' అంటే ఇష్టమని కులదీప్ అన్నారు. డేటింగ్ కు ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారని అడిగితే ఫ్రాన్స్ ద్వీపం బోరాబోరా పేరును చాహాల్, పారిస్ పేరును కులదీప్ చెప్పారు. ఆ ఇంటర్వ్యూను మీరూ చూడవచ్చు.

More Telugu News