judwaa 2: క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న `జుడ్వా 2`... బాలీవుడ్ కి కొత్త ఊపిరి!

  • ఇప్ప‌టివ‌ర‌కు రూ. 60 కోట్లు వ‌సూలు
  • వెల్ల‌డించిన బాలీవుడ్ ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌

ఇటీవ‌ల భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన హిందీ సినిమాలేవీ బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా క‌లెక్ష‌న్లు కురిపించ‌లేదు. స‌ల్మాన్ ఖాన్ `ట్యూబ్‌లైట్‌`, షారుక్ ఖాన్ `జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్‌` సినిమాలు కూడా మొద‌టి వీకెండ్‌లోనే బోల్తా ప‌డ్డాయి. కానీ శుక్ర‌వారం విడుద‌లైన `జుడ్వా 2` సినిమా మాత్రం బాలీవుడ్‌ క‌లెక్ష‌న్ల క‌ల‌ను తిరిగి తీసుకువ‌చ్చింది. మొద‌టి వారాంతానికి ఈ చిత్రం రూ. 60 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.

2017లో ఇప్పటి వరకు ఏ హిందీ చిత్రానికీ రాని కలెక్షన్లు ‘జుడ్వా 2’ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అన‌లిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. వ‌రుణ్ ధావ‌న్‌, జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌, తాప్సీలు న‌టించిన ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. వరుణ్‌ తండ్రి డేవిడ్‌ ధావన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1997లో సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘జుడ్వా’ సినిమాకు ఇది సీక్వెల్‌గా వచ్చింది. ‘జుడ్వా’ చిత్రం అక్కినేని నాగార్జున నటించిన ‘హలోబ్రదర్‌’ చిత్రానికి రీమేక్‌.

  • Loading...

More Telugu News