python: చేపల కోసం వల వేశాడు.. వలను లాగితే గుండె ఝల్లుమంది!
- వలలో చిక్కుకున్న కొండచిలువ
- తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఘటన
- చూడ్డానికి తరలి వచ్చిన ప్రజలు
గత నాలుగు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా పెదరాయవరం జగ్గరాజుచెరువులో చేపల కోసం వలలు వేస్తున్నారు. ఈ క్రమంలో పెదరాయవరం గ్రామానికి చెందిన పీతల చిట్టిబాబు కూడా చేపల కోసం వల విసిరాడు. వలలో చేపలు పడినట్టు అతను గుర్తించాడు. వెంటనే దాన్ని బయటకు లాగడానికి ప్రయత్నించాడు. అయితే అది చాలా బరువుగా ఉండటంతో, మరో ముగ్గురు వ్యక్తులు కూడా కలసి దాన్ని బయటకు లాగారు.
తీరా చూస్తే, వలలో కొండచిలువ చిక్కుకుపోయి ఉంది. దాన్ని బయటకు తీయడం వారి వల్ల కాకపోవడంతో... చివరకు గునపాలతో పొడిచి చంపేశారు. అనంతరం ఈ కొండచిలువను పెదరాయవరం ఎస్సీ పేటకు తరలించారు. ఈ సందర్భంగా దాన్ని చూడ్డానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ, నీటి ప్రవాహంలో ఈ కొండచిలువ కొట్టుకువచ్చి వలలో ఇరుక్కుపోయి ఉండవచ్చని తెలిపాడు.