thaman: తమన్ చేతికి మెగా హీరో మూవీ!
తెలుగులోని అగ్ర సంగీత దర్శకులలో తమన్ పేరు కనిపిస్తుంది. తెలుగు సినిమా సంగీతంపై ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన బాణీలను యూత్ ఎంతగానో ఇష్టపడుతుంది. అందువలన ఆయన తన కెరియర్ ను ఆరంభించిన దగ్గర నుంచి బిజీగానే వున్నారు. తాజాగా ఆయన చేతికి మెగా హీరో ప్రాజెక్టు దక్కినట్టు సమాచారం.
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ ను కట్టిపడేసే సంగీతాన్ని అందించడం తమన్ ప్రత్యేకత. అందువలన ఈ సినిమా కోసం ఆయనని తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి ఆయన బాణీలు ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.