paritala sriram: చంద్రబాబు వెళ్లిన అరగంటకు వెంకటాపురం చేరుకున్న కేసీఆర్

  • నూతన వధూవరులను ఆశీర్వదించిన కేసీఆర్
  • కేరింతలు కొట్టిన పరిటాల అభిమానులు
  • పలువురితో మాటలు కలిపిన కేసీఆర్
  • మధ్యాహ్నం తరువాత తిరిగి హైదరాబాద్ కు కేసీఆర్
ఈ ఉదయం నుంచి అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఆకాశమంత పందిరి, భూదేవంత పీటపై వైభవంగా జరుగుతున్న పరిటాల శ్రీరామ్ వివాహ మహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, తన వియ్యంకుడు, హీరో బాలకృష్ణ, పలువురు మంత్రులతో కలసి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి వేదిక దిగి వెళ్లిపోయిన అరగంట తరువాత కేసీఆర్ వెంకటాపురం చేరుకున్నారు. ఆపై ప్రత్యేక కాన్వాయ్ లో వేదిక వద్దకు వచ్చారు.

కేసీఆర్ ను చూడగానే, అక్కడున్న పరిటాల అభిమానులు పెద్దఎత్తున కేరింతలు కొట్టారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన కేసీఆర్, వారికి శుభాభినందనలు తెలిపి, అక్కడే కూర్చుని పలువురు ప్రముఖులతో మాటలు కలిపారు. కేసీఆర్ రాక సందర్భంగా వెంకటాపురంలో ఏపీ పోలీసులతో పాటు, తెలంగాణ నుంచి ప్రత్యేకంగా వచ్చిన పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం తరువాత ఆయన తిరిగి పుట్టపర్తికి హెలికాప్టర్ లో వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు.
paritala sriram
paritala ravi
chandrababu
kcr

More Telugu News