paritala sriram: నా బిడ్డ నిండు నూరేళ్లూ చల్లగా ఉండాలని ఆశీర్వదించండి: చంద్రబాబు, కేసీఆర్ లను కోరిన పరిటాల సునీత

  • అమ్మాయి పెళ్లయితే కేసీఆర్ దంపతుల సమక్షంలో జరిగుండేది
  • పరిటాల రవికి, కేసీఆర్ కూ మధ్య స్నేహబంధం
  • బిడ్డను నిండు మనసుతో ఆశీర్వదించాలని విన్నవించిన సునీత
తన బిడ్డ శ్రీరామ్, జ్ఞానలు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా జీవించి ఉండేలా మంచి మనసుతో ఆశీర్వదించాలని ఏపీ మంత్రి, దివంగత టీడీపీ నేత పరిటాల రవి సతీమణి సునీత, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లను కోరారు. వివాహ వేడుకకు ముందు మీడియాతో మాట్లాడిన ఆమె, తాను పిలవగానే చంద్రబాబు, కేసీఆర్ లు వస్తామని చెప్పారని, అమ్మాయి వివాహం అయి వుంటే కనుక కేసీఆర్ దంపతుల సమక్షంలోనే పెళ్లి జరిగి ఉండేదని అన్నారు.

అబ్బాయి వివాహం కావడంతో, వారు వచ్చి ఆశీర్వదించి వెళ్లినా తనకు అమితమైన ఆనందమేనని అన్నారు. తన భర్తకు, కేసీఆర్ కు మధ్య స్నేహబంధం ఉండేదని గుర్తు చేసుకున్న ఆమె, తన బిడ్డ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తే చాలని తెలిపారు. వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసిన ఆమె, పెళ్లి ఏర్పాట్లకు కష్టపడిన ప్రతి కార్యకర్తకూ కృతజ్ఞతలు తెలిపారు.
paritala sriram
paritala ravi
chandrababu
kcr

More Telugu News