kohli: విదేశాల్లో గెలిస్తేనే అత్యుత్తమ జట్టు అవుతుంది!: కోహ్లీ

  • విదేశీ పిచ్ లపై విజయాలు సాధిస్తేనే నెంబర్ వన్
  • గవాస్కర్ ప్రశంసలు గొప్పవి
  • సిరీస్ గెలవడంతో రిజర్వ్ బెంచ్ ని పరీక్షించా
  • రిజర్వ్ బెంచ్ కి కూడా అవకాశం ఇవ్వాలి కదా?

విదేశాల్లో కూడా ఈ విజయపరంపర కొనసాగిస్తేనే టీమిండియా ప్రపంచంలో అత్యుత్తమ వన్డే జట్టుగా ఎదుగుతుందని కెప్టెన్ కోహ్లీ అన్నాడు. నాలుగో వన్డేలో ఓటమి అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, ప్రస్తుత టీమిండియా గత జట్లన్నింటికంటే గొప్ప జట్టుగా పేరు తెచ్చుకుంటుందన్న గవాస్కర్ ప్రశంస గొప్పదని తెలిపాడు. కొన్నేళ్లపాటు జట్టుకు ఆడిన వ్యక్తి నుంచి లభించిన ఆ ప్రశంస అత్యుత్తమమని తెలిపాడు. అయితే ఈ జట్టు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని అన్నాడు.

ప్రస్తుతం స్వదేశంలో ఆడుతున్నామని, ఏమాత్రం అనుకూలించని పిచ్ లపై నిలకడైన విజయాలు విదేశాల్లో సాధించిన తరువాత హాయిగా కూర్చుని చాలా సాధించామని సంబరపడవచ్చని ఆయన అన్నాడు. ఇప్పటికే ఆసీస్‌ పై సిరీస్‌ గెలవడంతో రిజర్వు బెంచ్‌ సత్తా పరీక్షించామని చెప్పాడు. రిజర్వ్ బెంచ్ లో ఉన్నవారికి కూడా అవకాశాలివ్వాలి కదా? అని కోహ్లీ అన్నాడు. ఉమేష్ నాలుగు వికెట్లు తీసి సత్తాచాటితే, షమీ ఆకట్టుకున్నాడని తెలిపాడు. ప్రయోగాలకు తానెప్పుడూ వ్యతిరేకం కాదని తెలిపాడు. ఒకటి విఫలమైనంత మాత్రాన తాను ప్రయోగాలు మానెయ్యనని తెలిపాడు. 

More Telugu News