యశ్వంత్ సిన్హా: యశ్వంత్ సిన్హా వ్యాఖ్యలపై నీతి ఆయోగ్ సభ్యుడి వ్యంగ్యాస్త్రాలు!

  • కొద్దిగా జలుబు చేస్తే చికున్ గున్యా అంటున్నట్లుగా ఉంది!
  • యశ్వంత్ సిన్హాను డాక్టర్ గా అభివర్ణిస్తూ బిబేక్ దేబ్రాయ్ చురకలు

పెద్దనోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ అమలు చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో పడిందంటూ ఓ ఆంగ్లపత్రికకు రాసిన వ్యాసంలో బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ వ్యాఖ్యలపై నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 ‘ఆర్థిక వ్యవస్థకు కొద్దిగా జలుబు చేయడంతో..యశ్వంత్ సిన్హా అనే డాక్టర్ ను కలిస్తే.. ‘అది సీరియస్.. మెడికల్ ఎమర్జెన్సీ.. చికున్ గున్యా కూడా అయ్యే అవకాశం ఉండొచ్చు, చనిపోయే అవకాశాలూ కూడా లేకపోలేదు’ అని చెప్పారు. దీంతో, మరో వైద్యుడిని నేను కలిశాను. ‘కొంచెమే జలుబు చేసింది..తగ్గిపోతుంది, ఏం ఫర్వాలేదు. కొద్దిగా ఓపిక పట్టండి’ అని ఆ వైద్యుడు చెప్పారు’ అంటూ యశ్వంత్ సిన్హాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, ‘ఇండియా @ 70, మోదీ @ 3.5‘ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిబేక్ దేబ్రాయ్ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.

More Telugu News