amitabh bachachan: అమితాబ్ బ‌చ్చ‌న్ గెట‌ప్‌లో ఉన్న హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

`హ‌మ్‌` సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్ పోషించిన టైగర్ పాత్ర గెట‌ప్‌లో సంద‌డి చేసిన ఈ హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా? ఈమె ఎవ‌రో కాదు... పొడుగు కాళ్ల సుంద‌రి శిల్పా శెట్టి. ద‌ర్శకురాలు ఫ‌రాఖాన్‌ వ్యాఖ్యానంలో `లిప్ సింగ్ బ్యాటిల్‌` పేరుతో స్టార్‌ప్ల‌స్ ఛాన‌ల్ రూపొందిస్తున్న కార్య‌క్ర‌మం కోసం ఆమె ఇలా గెట‌ప్ వేసుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో బాలీవుడ్ పాట‌ల‌కు ఆయా పాట‌ల్లో న‌టించిన న‌టీన‌టుల హావ‌భావాల‌ను ప‌లికిస్తూ డ్యాన్స్‌లు చేయాలి.

ఆ క్రమంలో అమితాబ్ న‌టించిన `జుమ్మా చుమ్మా` పాట‌కు శిల్పా డ్యాన్స్ చేసింది. అందుకోసం ఆమె ఈ గెట‌ప్ వేసుకుంది. త‌న గెట‌ప్‌కి సంబంధించిన ఫొటోల‌ను శిల్పా శెట్టి త‌న ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అమితాబ్ బ‌చ్చ‌న్ వేసిన స్టెప్ వేస్తూ ఓ వీడియోను కూడా ఆమె పోస్ట్ చేసింది.

More Telugu News