దసరా ఉత్సవాల్లో రాముడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక సాహితీ వేత్త
- మానవత్వం లేని రాముడు దేవుడు ఎలా అవుతాడు?
- కట్టుకున్న భార్యను వదిలేసిన వాడు ఏ విషయంలో ఆదర్శవంతుడు?
- అలాంటి వ్యక్తిని చూసి ఏం నేర్చుకోవాలి?
- సాహితీ వేత్త భగవాన్ విమర్శలు
రాముడికి ఆలయం నిర్మించేందుకు బీజేపీ, సంఘ్ పరివార్ పడుతున్న పాట్లు నగుబాటుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మానవత్వం లేని రాముడు దేవుడు ఎలా అవుతాడు? అని ఆయన అడిగారు. కట్టుకున్న భార్యను వదిలేసిన వాడు ఏ విషయంలో ఆదర్శవంతుడు అవుతాడు? అని ఆయన నిలదీశారు. అలాంటి వ్యక్తిని చూసి ఏం నేర్చుకోవాలి? అని ఆయన ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.