indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కొండ దిగువన 3 కి.మీ సాగిన భక్తుల క్యూలైన్... తీవ్ర ఇబ్బందులు

  • నేడు దుర్గమ్మ జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం
  • అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
  • పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు దంపతులు

నేడు దుర్గమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రావడం, అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుండటంతో అర్ధరాత్రి 2 గంటల నుంచే భక్తులతో విజయవాడ ఇంద్రకీలాద్రి కిక్కిరిసిపోయింది. తెల్లారేసరికి అమ్మ దర్శనం కోసం క్యూలైన్ కొండ దిగువన 3 కిలోమీటర్ల మేరకు సాగింది. క్యూలైన్లలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. క్యూలైన్లలో వేచి చూస్తున్న వారికి మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తున్నప్పటికీ, ఆ ఏర్పాట్లు కేవలం కొండపై సుమారు కిలోమీటరు మేరకు క్యూలో ఉన్నవారికి మాత్రమే సరిపోతున్నాయని తెలుస్తోంది.

కాగా, నేడు ఉదయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు అమ్మవారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకుని, చీర, సారె అందించనున్నారు. ఈ సందర్భంగా సామాన్య భక్తులకు ఆటంకాలు కలుగకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. భక్తులు పోటెత్తడంతో అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశామని, చంద్రబాబు వస్తున్నందున కేవలం ఒక్క క్యూలైన్ ను మాత్రమే నిలిపామని, ఆయన వెళ్లిన తరువాత దాన్ని కూడా సాధారణ భక్తుల కోసం తెరుస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

More Telugu News