Avatar: అతి భారీ బడ్జెట్ తో ‘అవతార్‌’ సీక్వెల్స్‌!

  • 'అవతార్'కు నాలుగు సీక్వెల్స్  
  • వీటి కోసం రూ.6540 కోట్లకు మించి ఖర్చు
  • ‘అవ‌తార్- 2’.. డిసెంబరు 18, 2020కి విడుదల 
  • ‘అవతార్‌ 3’.. డిసెంబరు 2021లో రిలీజ్

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించిన ‘అవతార్‌’ వచ్చి దాదాపు తొమ్మిదేళ్లు అవుతోంది. అప్ప‌టి నుంచి ఆ సినిమా ద‌ర్శ‌కుడు జేమ్స్‌ కామెరూన్ (63) ఈ సినిమాను నాలుగు సీక్వెల్స్ గా తెర‌కెక్కించేందుకు స్క్రిప్ట్‌ పనిలో ఉన్నారు. ఈ సీక్వెల్స్ కోసం దాదాపు రూ.6540 కోట్ల (ఒక బిలియన్‌ డాలర్లు) కన్నా అధికంగా ఖ‌ర్చుచేయ‌నున్నార‌ట‌.

ఈ సీక్వెల్ ల‌లో మొద‌టిది ‘అవ‌తార్- 2’.. డిసెంబరు 18, 2020లోను, రెండ‌వ‌ది ‘అవతార్‌ 3’ డిసెంబరు 2021లోను, మూడ‌వ సీక్వెల్ ‘అవతార్‌ 4’ డిసెంబరు 2024లోను, ఇక నాలుగ‌వ‌ది ‘అవతార్‌ 5’ డిసెంబరు 2025లోను విడుద‌ల కానున్నాయి. 

More Telugu News