hani preet: వేషమూ మార్చెను... బురఖాలో లాయర్ ఇంటికి వచ్చిన హనీ ప్రీత్!

షార్ట్స్‌లో చూడండి
రెండు నెలలుగా బృందాలుగా విడిపోయి దేశసరిహద్దులలోను, విమానాశ్రయాలలోను నిఘా పెట్టిన పోలీసులకు సవాల్ విసురుతూ డేరాబాబా గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీ ప్రీత్ ఇన్సాన్ చివరికి ఢిల్లీలోనే వుందని తేలింది. నిన్న మధ్యాహ్నం ఆమె న్యాయవాది ప్రదీప్ ఆర్య నివాసానికి వెళ్లి ముందస్తు బెయిల్ పేపర్లపై సంతకం పెట్టింది. దీనిపై ఆయనను మీడియా ప్రశ్నించగా, ఆమె నేపాల్ లేదా మరో దేశం పారిపోలేదని, భారత్ లోనే, దేశ రాజధానిలోనే ఉందని అన్నారు.

దీంతో లాయర్ ప్రదీప్ ఆర్య నివాసానికి వచ్చేదారిలో సీసీ పుటేజ్ పై దృష్టిసారించిన పోలీసులు, హనీప్రీత్ ఇన్సాన్ ఆచూకీ కనిపెట్టారు. బురఖా ధరించిన హనీప్రీత్ నడుచుకుంటూ న్యాయవాది నివాసానికి వచ్చి, వెళ్లింది. దీంతో ఆమె ఢిల్లీలోని కైలాష్ పార్క్ పరిసరాల్లో ఉంటుందని భావించి పోలీసులు గాలింపు చేపట్టారు. ఆమెను ఎలాగైనా పట్టుకుంటామని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 
Go Back to Shorts
hani preet
dera bab
hanipreet
delhi
police

More Telugu News