tamannaah: రాజమౌళి సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్న మిల్కీ బ్యూటీ!

* రాజమౌళిపై ఆగ్రహంతో ఉన్న తమన్నా

* బాహుబలి-2 సినిమాలో తన క్యారెక్టర్ పై అలక

* నిడివి పెంచేందుకు తిరస్కరించిన రాజమౌళి

* తన నిర్ణయాన్ని సన్నిహితుల వద్ద వెల్లడించిన తమన్నా

ఏ హీరోయిన్ అయినా దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాలో నటించాలని కోరుకుంటుంది. కానీ, తమన్నా మాత్రం రాజమౌళి సినిమాలో మరోసారి నటించకూడదని గట్టి నిర్ణయం తీసుకుందట. దీనికి ఓ కారణం కూడా ఉంది. 'బాహుబలి-2' చిత్రంలో తమన్నా క్యారెక్టర్ ఎంతోసేపు కనిపించదు. ఇదే విషయంపై జక్కన్నతో తమన్నా మాట్లాడిందట కూడా. తన క్యారెక్టర్ నిడివి పెంచాలని కోరిందట. అయితే, ఆమె కోరికను రాజమౌళి సున్నితంగా తిరస్కరించాడట. దీంతో, అలకబూనిన మిల్కీ బ్యూటీ... ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో, రాజమౌళి సినిమాలో మరోసారి నటించకూడదనే నిర్ణయానికి వచ్చేసింది. ఇదే విషయాన్ని తన సన్నిహితులకు తమన్నా చెప్పిందట. 

More Telugu News