padmavathi: `ప‌ద్మావ‌తి`లో షాహిద్ క‌పూర్ లుక్ ఇదే!

  • ర‌త‌న్ సింగ్ పాత్ర‌లో రాజ‌సం కురిపిస్తున్న షాహిద్‌
  • పాత్ర కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌న్న హీరో

సంజ‌య్‌లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న `ప‌ద్మావ‌తి` చిత్రంలో షాహిద్ క‌పూర్ పోషిస్తున్న మహారావ‌ల్ ర‌త‌న్ సింగ్ పాత్ర ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. చిత్తోర్ మ‌హారాజుగా, ప‌ద్మావ‌తి భ‌ర్తగా షాహిద్ క‌పూర్ ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. ఈ పాత్ర‌లో మ‌హారాజులాగ క‌నిపించ‌డానికి షాహిద్ క‌పూర్ చాలా వ‌ర్క‌వుట్లు చేసిన‌ట్టు తెలుస్తోంది.

త‌న లుక్ గురించి షాహిద్ మాట్లాడుతూ - `రాజ్‌పుత్ వంశానికి చెందిన మ‌హారాజులు శారీరకంగా చాలా దృఢంగా క‌నిపిస్తారు. ర‌త‌న్ సింగ్‌లా క‌నిపించ‌డానికి నేను కండ‌లు పెంచాను. శ‌రీరంలో ఉన్న కొవ్వును త‌గ్గించుకునేందుకు ప్ర‌త్యేకంగా డైట్ పాటించాను` అన్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే `ప‌ద్మావ‌తి` పాత్ర పోషిస్తున్న దీపికా ప‌దుకొనే ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేశారు. ఇంకా ఇందులో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను పోషించిన ర‌ణ్‌వీర్ సింగ్ లుక్‌ను విడుద‌ల చేయాల్సి ఉంది. డిసెంబ‌ర్ 1న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

More Telugu News