గొంతు స‌వరించిన గౌత‌మ్ గంభీర్‌... వీడియో చూడండి

  • జాతీయ గీతం పాడిన క్రికెట‌ర్‌
  • ప్రొ క‌బ‌డ్డీ ఢిల్లీ జ‌ట్టు కోసం
  • ట్విట్ట‌ర్‌లో వీడియో
భార‌త క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ మొద‌టి సారి త‌న గొంతు స‌వ‌రించుకుని జాతీయ గీతాన్ని ఆలపించాడు. ప్రొ క‌బడ్డీ లీగ్ 2017లో ఆడుతున్న ఢిల్లీ జ‌ట్టు కోసం ఆయ‌న ఈ పాట‌ను పాడాడు. రికార్డింగ్ స్టూడియోలో తాను పాడుతున్న వీడియోను గంభీర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో షేర్ చేశాడు. జాతీయ గీతం పాడుతుంటే రికార్డింగ్ థియేట‌ర్‌ కూడా దేశభ‌క్తిని ప్ర‌తిధ్వ‌నించింద‌ని ఆయ‌న పోస్ట్ చేశాడు. మ్యూజిక్‌కి అనుగుణంగా గంభీర్ జాతీయ‌గీతాన్ని పాడుతుండ‌టం ఈ వీడియోలో చూడొచ్చు. గ‌తంలో హ‌ర్యానా జ‌ట్టు కోసం ఒలింపిక్ గ్ర‌హీత సాక్షి మాలిక్ కూడా జాతీయ గీతాన్ని పాడిన సంగ‌తి తెలిసిందే.
Go Back to Shorts
gautam gambhir
national anthem
singing
pro kabaddi
delhi leg

More Telugu News