బిగ్‌బాస్ 11లో సల్మాన్ ఖాన్ పారితోషికం... ఎపిసోడ్‌కి రూ. 11 కోట్లు?
బిగ్‌బాస్ నిర్వాహకులు ఒక్క ఎపిసోడ్‌కి రూ. 11 కోట్లు చొప్పున సల్మాన్‌కి ముట్టజెబుతున్నట్టు తెలుస్తోంది. గత సీజన్‌లో (బిగ్‌బాస్ 10) ఎపిసోడ్‌కి రూ. 8 కోట్ల చొప్పున సల్మాన్ పారితోషికంగా తీసుకున్నాడు. గత సీజన్ నుంచి సాధారణ పౌరులకు కూడా బిగ్‌బాస్‌లో అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో పాల్గొంటున్న సెలబ్రిటీలకు పెద్ద మొత్తంలో పారితోషికం ఇస్తుండగా, సాధారణ పౌరులకు మాత్రం ఎలాంటి పారితోషికం ఇవ్వడం లేదనే వార్త కూడా చక్కర్లు కొడుతోంది.