bigboss: ఈ ఏడాది సినీ నటి అర్చన వివాహం.. భేషుగ్గా ఉన్న జాతకం!: బిగ్ బాస్ షోలో జ్యోతిష్యుడు

  • ఈ ఏడాది అర్చనకు కల్యాణ యోగం
  • శివబాలాజీ, హరితేజలు షో విజేతలుగా నిలిచే అవకాశం
  • నవదీప్ చాలా క్లిష్టమైన మనిషి
  • ఆదర్స్ గుడ్ డేస్ ప్రారంభమయ్యాయి
సినీ నటి, బిగ్‌ బాస్ తెలుగు కంటెస్టెంట్ అర్చనకు వివాహ ఘడియలు ముంచుకొస్తున్నాయని జ్యోతిష్యుడు రాధాకృష్ణ తెలిపారు. బిగ్‌ బాస్ షో అంతిమ దశకు చేరుకుంటున్న క్రమంలో కంటెస్టెంట్స్ లో ఉత్సాహం పెంచేందుకు ఆస్ట్రాలజర్ రాధాకృష్ణను బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. షోలో మిగిలిన ఐదుగురి జాతకాలు ఆయన చెప్పారు.

శివబాలాజీ, హరితేజలకు షోను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారు. ఆదర్శ్ జాతకం గాడినపడుతోందని, గత వారం నుంచి బాగుందని తెలిపారు. నవదీప్ చాలా క్లిష్టమైన మనిషని అన్నారు. అర్చన జాతకం అద్భుతంగా ఉందని, ఏడాదిలోగా వివాహం జరుగుతుందని అన్నారు. పెళ్లియోగం ముంచుకొస్తోందని చెప్పారు.

కాగా, తన ప్రియుడు విదేశాల్లో ఉన్నాడని, అతని దగ్గరకి వెళ్లిపోవాలని అనిపిస్తోందని అర్చన పలుమార్లు బాధపడిన సంగతి తెలిసిందే. ఆమెను కలిసేందుకు వచ్చిన తల్లిని కూడా అతని యోగక్షేమాలు ఆరాతీసిన సంగతి తెలిసిందే.  
bigboss
archana
hariteja
navadeep
shivabalaji
navadeep
adarsh

More Telugu News