charan samanta: విజయదశమికి 'రంగస్థలం' నుంచి చరణ్ ఫస్టులుక్!
సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతవరకూ ఈ సినిమా నుంచి లొకేషన్ కి సంబంధించిన స్టిల్స్ బయటికి వచ్చాయి గానీ, ఫస్టులుక్ మాత్రం రాలేదు. దాంతో అంతా కూడా ఫస్టులుక్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి దసరాకి ఫస్టులుక్ ను వదలడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. పవన్ చేతుల మీదుగా చరణ్ ఫస్టులుక్ రిలీజ్ అవుతుందని అంటున్నారు. 'నాయక్' ఆడియో ఫంక్షన్ తరువాత పవన్ వస్తాడని చెబుతోన్న చరణ్ సినిమా ఇదే. దాంతో మెగా అభిమానులంతా ఆసక్తిని చూపుతున్నారు. 'రంగస్థలం' తన కెరియర్లో విభిన్నమైనదిగా నిలుస్తుందనీ, నటుడిగా తన సత్తాను చాటే చిత్రమవుతుందని చరణ్ భావిస్తున్నాడు. ఆయన సరసన సమంతా నటిస్తోన్న సంగతి తెలిసిందే.