mexico: మెక్సికన్ల కొంప ముంచిన మాక్ డ్రిల్స్...భూకంపంలో ప్రాణాలు పోవడానికి కారణమిదే!

  • 7.4 తీవ్రతతో భూకంపం
  • శిధిలాలకింద వందల మంది
  • భూకంపానికి ముందే మాక్ డ్రిల్స్ 
  • ప్రమాద హెచ్చరికలను మాక్ డ్రిల్స్ లో భాగమని భావించిన ప్రజలు
  • 1987 సెప్టెంబర్ 19న సంభవించిన భూకంపాన్ని గుర్తు చేసుకుంటూ, రక్షణ చర్యలు సూచించిన మాక్ డ్రిల్స్

మెక్సికోలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూకంపం తీవ్రతకు భారీ భవంతులు పేకమేడల్లా కూలిపోయాయి. వాటిలోని ప్రజలు సజీవ సమాధైపోయారు. సహాయకచర్యలు కొనసాగుతున్నకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య పెరగడం వెనుక కారణం తాజాగా వెలుగు చూసింది. మెక్సికోలో 1987 సెప్టెంబర్ 19న భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం ధాటికి పదివేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దానిని పురస్కరించుకుని మెక్సికోలోని ప్రధాన పట్టణాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు.

భూకంప సమయాల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలు, భూకంప ప్రభావం బారిన పడకుండా ఉండాలంటే చేయాల్సిన పనులను గుర్తు చేస్తూ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సైరన్లు మోగించారు. వీధుల్లోకి సిబ్బంది, వలంటీర్లు వచ్చి, జాగ్రత్తలు చెప్పారు. వాటిని చూసిన ప్రజలు గతం ఆలోచనల్లోంచి పూర్తిగా బయటకు రాకముందే మరోసారి భూకంపాన్ని సూచిస్తూ, హెచ్చరికగా సైరన్లు మోగాయి. అయితే, ఈ నిజం హెచ్చరికలను మాక్ డ్రిల్ సైరన్లుగా భావించిన ప్రజలు లైట్ తీసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు అప్రమత్తమయ్యేలోపు భవనాలు వారి మీద కూలిపోయాయి. దీంతో వారు ప్రాణాలు కోల్పోయారు. 

More Telugu News