pavan: పవన్-త్రివిక్రమ్ మూవీ తాజా షెడ్యూల్ విశేషాలు!

  •  షూటింగ్ దశలో పవన్ 25వ సినిమా
  •  తాజా షెడ్యూల్ ఈ నెల 20 నుంచి హైదరాబాద్ లో
  •   పవన్ సరసన కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్
  •  జనవరి 10వ తేదీన విడుదల    

పవన్ కల్యాణ్ తన 25వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'ఇంజనీర్ బాబు' .. 'అజ్ఞాత వాసి' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా అలరించనున్నారు. రీసెంట్ గా బ్యాంకాక్ లో ఒక షెడ్యూల్ ను పూర్తిచేశారు.

తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ మొదలుకానుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించిన తరువాత యూరప్ వెళతారట. డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేసి, జనవరి10వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. సంఖ్యా పరంగా ఈ సినిమా ప్రత్యేకమైనది కావడంతో, పవన్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోవాలని అభిమానులు భావిస్తున్నారు.       

More Telugu News