తగ్గని ట్రంప్ ఇంటిపోరు... మెలానియాను సుతారంగా నెట్టేసిన ట్రంప్.. వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తగ్గని ట్రంప్ ఇంటిపోరు... మెలానియాను సుతారంగా నెట్టేసిన ట్రంప్.. వీడియో ఇదిగో!

  • న్యూజెర్సీలో వైమానిక విన్యాసాలు
  • పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్ దంపతులు
  • సభకు తనను పరిచయం చేసిన మెలానియాను నెట్టిన ట్రంప్
  • వైరల్ అయిన వీడియో
ఈ సంవత్సరం ఇటలీ తదితర దేశాల్లో పర్యటనల సందర్భంగా, తన భార్య మెలానియాతో ఉన్న విభేదాలను వీడియో కెమెరాల సాక్షిగా బయటపెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరోసారి అలాంటి పరిస్థితులలోనే దొరికిపోయారు. వారి మధ్య అభిప్రాయ భేదాలు సమసిపోలేదని చెబుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజెర్సీలో మిలటరీ కుటుంబాలతో కలసి ఎయిర్ ఫోర్స్ వన్ నిర్వహించిన వైమానిక ప్రదర్శనకు ట్రంప్ హాజరైన వేళ ఈ ఘటన జరిగింది.

అక్కడ ఏర్పాటు చేసిన సభకు ట్రంప్ ను పరిచయం చేస్తూ, మెలానియా స్వాగతోపన్యాసం చేశారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మెలానియాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన ట్రంప్, ఆపై ఆమె నడుముపై చెయ్యి వేసి, సున్నితంగా ముందుకు తోయడంతో, ఆమె వేదికపై నుంచి దిగిపోయారు. ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా, గతంలో ఇజ్రాయిల్ లో పర్యటనకు వచ్చిన వేళ, రెడ్ కార్పెట్ పై స్వాగతాన్ని అందుకుంటూ, తన భార్య చేతిని అందుకునేందుకు ట్రంప్ ప్రయత్నించగా, ఆమె విసిరికొట్టిన సంగతి తెలిసిందే. మరోసారి ఓ సభలో నవ్వుతూ నిలబడిన మెలానియా వైఖరిని ట్రంప్ ఆక్షేపించడంతో ఆమె ముఖం మాడిపోయింది. తాజా ఘటనతో ట్రంప్ కాపురంలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.
trump
melania
air force one

More Telugu News