charan: చరణ్ కూడా సంక్రాంతికే వచ్చేస్తున్నాడు!

  •  షూటింగ్ దశలో 'రంగస్థలం 1985'
  •  రిలీజ్ వాయిదా పడుతుందనడంలో నిజం లేదు
  •  సంక్రాంతి బరిలోకి దిగడం ఖాయం
  •  స్టార్ వార్ పై మరింత ఆసక్తి  

  

చరణ్ .. సుకుమార్ కాంబినేషన్లో 'రంగస్థలం 1985' సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో వుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో, చరణ్ పల్లెటూరి బుల్లోడుగా కనిపించనున్నాడు. పల్లెటూరి నేపథ్యానికి సంబంధించినది కావడం వలన ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తున్నట్టుగా మొదట్లోనే చెప్పారు.

 అదే సమయంలో పవన్ - త్రివిక్రమ్ సినిమా విడుదల వుండటంతో, చరణ్ మూవీ డిసెంబర్లో గానీ .. వేసవిలో గాని వస్తుందనే టాక్ వినిపించింది. అయితే అదంతా కేవలం ప్రచారం మాత్రమేననీ, తమ సినిమా సంక్రాంతికే వస్తుందని తాజాగా నిర్మాతలు స్పష్టం చేశారు. ఇప్పటికే బాలకృష్ణ - కె.ఎస్.రవికుమార్ మూవీ .. పవన్ - త్రివిక్రమ్ మూవీ .. మహేశ్ - కొరటాల 'భరత్ అను నేను' సంక్రాంతి బరిలో వున్నాయి. ఈ బరిలోకి చరణ్ దిగడం కూడా ఖాయమైపోయింది. ఇక ఈ సంక్రాంతికి సందడి ఒక రేంజ్ లో ఉంటుందన్న మాట.

More Telugu News