rana: హాలీవుడ్ మూవీలో సైంటిస్ట్ పాత్రలో రానా!

  •  హాలీవుడ్ లోకి అడుగుపెడుతోన్న రానా
  •  మూవీ టైటిల్ గా 'విజిల్' ఖరారు
  •  సముద్రంలో అదృశ్యమైన ఓడ నేపథ్యంలో కథ
  •  త్వరలోనే సెట్స్ పైకి

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ వెళుతోన్న రానా, త్వరలో ఒక హాలీవుడ్ మూవీ చేయనున్న సంగతి  తెలిసిందే. ఈ సినిమాకి 'విజిల్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

1888వ సంవత్సరంలో 700 మంది ప్రయాణికులతో ఓ భారీ ఓడ సౌరాష్ట్ర నుంచి బయలుదేరింది. అలా బయలుదేరిన కొన్ని రోజులకు అది అదృశ్యమైంది. ఆ ఓడ ఏమైంది? దాని అదృశ్యానికి గల కారణాలేంటనే విషయాలపై పరిశోధన చేసే సైంటిస్ట్ పాత్రలో రానా కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఈ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న రానా, మున్ముందు మరెన్ని ప్రయోగాలు చేస్తాడో చూడాలి.   

More Telugu News