'స్వింగు జరా' సాంగ్ కి తమన్నా అందుకుంది 60 లక్షలా?
Add ap7am to your home Screen

'స్వింగు జరా' సాంగ్ కి తమన్నా అందుకుంది 60 లక్షలా?

  • 'జై లవ కుశ'లో స్పెషల్ సాంగ్ చేసిన తమన్నా
  • గతంలోను స్పెషల్ సాంగ్స్ లో దుమ్మురేపేసింది
  •  ఈ తరహా సాంగ్స్ కి తమన్నా భారీ మొత్తమే వసూలు చేస్తుందనే టాక్ వుంది.
  •  ఈ సారి 60 లక్షలు తీసుకుందంటూ ప్రచారం
'జై లవ కుశ' సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ సరసన రాశిఖన్నా .. నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. ఈ ఇద్దరు కథానాయికలతో కలిసి ఎన్టీఆర్ నాలుగు పాటలకు స్టెప్పులేశాడు. ఇక మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే స్పెషల్ సాంగ్ వుంటే బాగుంటుందని భావించి, ఆ సాంగ్ ను తమన్నాతో చేయించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన 'స్వింగ్ జరా' అనే ఈ సాంగ్ టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు.

స్పెషల్ సాంగ్స్ చేయడం తమన్నాకి అలవాటే. గతంలో 'అల్లుడు శీను' .. 'స్పీడున్నోడు' సినిమాల్లోను స్పెషల్ సాంగ్స్ తో ఆమె అదరగొట్టేసింది. అందుకు భారీస్థాయిలో ఆమె పారితోషికం అందుకుందనే టాక్ వినిపించింది. 'జై లవ కుశ'లో స్పెషల్ సాంగ్ చేసినందుకు కూడా ఆమె 60 లక్షల వరకూ పుచ్చుకుందనే వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. 
ntr
rasi khanna

More Telugu News