thugs of hindustan: `థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌`లో ఆమిర్ ఖాన్ లుక్ ఇదేనా?

  • వైర‌ల్ అవుతున్న ఫొటో
  • అచ్చం గూండాలాగే క‌నిపిస్తున్న మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌
  • న‌వంబ‌ర్ 7, 2018న విడుద‌ల కానున్న చిత్రం

విజ‌య్ కృష్ణ ఆచార్య ద‌ర్శ‌క‌త్వంలో మొద‌టి సారిగా అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ న‌టిస్తున్న చిత్రం `థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌`. ఇందులో ఓ గూండా పాత్ర‌ను ఆమిర్ పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎలాంటి పాత్ర‌లోకైనా ప‌రకాయ ప్ర‌వేశం చేసే ఆమిర్ ఖాన్ ఈ గూండా పాత్ర కోసం చాలా క‌స‌ర‌త్తులు చేసినట్లే క‌నిపిస్తోంది. ఈ సినిమాలో ఆయ‌న గెట‌ప్‌కు సంబంధించిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. పొడ‌వాటి జుట్టు, పెద్ద మీసాలు, మాసిన వ‌స్త్రాలతో ఆమిర్ అచ్చం గూండాలాగే క‌నిపిస్తున్నాడు. యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 7, 2018న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ య‌శ్‌రాజ్ ఫిల్మ్స్ ప్ర‌క‌టించింది. ఈ సినిమాలో ఆమిర్ స‌ర‌స‌న క‌త్రినా కైఫ్ న‌టిస్తోంది.

More Telugu News