sai dharam tej: స్టార్ హీరోయిన్ తో లవ్ లో పడిన సాయిధరమ్ తేజ్?

షార్ట్స్‌లో చూడండి
తాజాగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. కథానాయిక రెజీనాతో సాయిధరమ్ తేజ్ లవ్ లో పడ్డాడనీ, ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడనేది ఆ వార్త సారాంశం. ఈ ఇద్దరి కాంబినేషన్లో వరుస సినిమాలు వచ్చినప్పుడే వీళ్లు ప్రేమలో పడ్డారనే వార్తలు వచ్చాయి. అయితే అదంతా పుకారు మాత్రమేనని ఇద్దరూ ఖండించారు. అయితే నిజంగానే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారనీ .. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనే వార్త తాజాగా తెరపైకి వచ్చింది.

ఈ విషయంలో తన తల్లిదండ్రులను ఒప్పించే పనిలో సాయిధరమ్ తేజ్ వున్నాడని అంటున్నారు. ఇక రెజీనా మాత్రం తన కెరియర్ పీక్ లో వున్న కారణంగా కొంతకాలం ఆగితే బాగుంటుందని అంటున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. సాయిధరమ్ తేజ్ మాత్రం వచ్చే ఏడాది పెళ్లి చేసుకునే ఆలోచనలో వున్నాడని అంటున్నారు. జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారంలో వాస్తవమెంతో చూడాలి మరి.  
Go Back to Shorts
sai dharam tej
regina

More Telugu News