: 50 శాతం యూకే విజిటర్ వీసాలు భారతీయులు, చైనీయులకే!

బ్రిటన్ ఇస్తున్న విజిటింగ్ వీసాల్లో దాదాపు 50 శాతం భారతీయులు, చైనీయులకే లభిస్తున్నాయి. ఈ జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నాన్-యూరోపియన్ ఎకనమిక్ ఏరియా (ఈఈఏ) దేశీయులకు యూకే జారీ చేసిన వీసాల్లో దాదాపు సగం వరకు ఈ రెండు దేశాల వారికే దక్కడం గమనార్హం. మొత్తం 26.3 లక్షల వీసాలు జారీ చేయగా వీరిలో 20.38 (77 శాతం) లక్షల మంది ఒంటరి విజిటర్లే. గతేడాదితో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువ.  వీరిలో 26 శాతం మంది చైనీయులు కాగా, 20 శాతం మంది భారతీయులు ఉన్నారు. బ్రిటన్ జారీ చేసిన వీసాల్లో విజిటర్, వర్క్, స్టడీ వీసాలున్నాయి. యూకే హోం ఆఫీస్ గణాంకాల ప్రకారం.. 4.14 లక్షల మంది భారతీయులు విజిటర్ వీసాలపై యూకేను సందర్శించారు. గతేడాదితో పోలిస్తే ఇది పదిశాతం ఎక్కువ.

More Telugu News