: చిరంజీవి, రామ్‌చరణ్‌నీ పెట్టి ‘మగధీర 2’ కథ రాయాలని ఉంది: సినీ రచయిత విజయేంద్రప్రసాద్

ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీవల్లీ.’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, మన మనసు నుంచి వచ్చే భావ తరంగాలను చూడగలిగితే, వాటిని అదుపు చేయగలిగితే ఎన్నో మంచి పనులు చేయొచ్చని, ముఖ్యంగా చెడు జరగకుండా చూడొచ్చని, ఇందుకోసం అశోక్ మల్హోత్రా అనే సైంటిస్ట్ చేసే ప్రయోగం పేరే ‘శ్రీవల్లీ’ అని చెప్పారు.

ఈ ప్రయోగాన్ని తనపై చేయమంటూ ఆ సైంటిస్ట్ కూతురు ముందుకొస్తుందని, ఆమె పేరు ‘శ్రీవల్లీ’ అని ...ఈ ప్రయోగం వల్ల ఆమెకు గతజన్మ స్మృతులు మొదలవుతాయని, గత జన్మలో తన పేరు లైలా అని తెలుసుకుంటుందని అన్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ట్రయాంగిల్ ప్రేమకథతో నడుస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా, హిందీలో వచ్చిన ‘నాయక్’కు సీక్వెల్ రాస్తున్నానని చెప్పిన ఆయన, చిరంజీవి, రామ్ చరణ్ కాంబనేషన్ లో ‘మగధీర-2’ కథ రాయాలని ఉందని ఈ సందర్భంగా తన మనసులో మాటను వ్యక్తం చేశారు. ఆ అవకాశం తనకు రావాలనీ, ఆ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నానని విజయేంద్రప్రసాద్ చెప్పారు.

More Telugu News