: ఆ వీడియో పొరపాటున పోస్ట్ చేశానంటూ క్షమాపణలు చెప్పిన వైట్ హౌస్ అధికారి!

అమెరికాను అతలాకుతలం చేస్తున్న‘ఇర్మా’ హరికేన్ కారణంగా లక్షలాది ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇర్మా’ బీభత్సానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను వైట్ హౌస్ సోషల్ మీడియా చీఫ్ డ్యాన్ స్కావినో పోస్ట్ చేశారు. ఇందులో, మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నీరు చేరిందంటూ ఓ వీడియో ఒకటి ఉంది. అయితే, ఆ వీడియో తమ ఎయిర్ పోర్ట్ కు సంబంధించింది కాదంటూ సంబంధిత అధికారులు చెప్పడంతో, డ్యాన్ స్కావినో స్పందించారు. వెంటనే, ఆ వీడియోను తొలగించిన ఆయన, పొరపాటున పోస్ట్ చేశానంటూ ఎయిర్ పోర్ట్ అధికారులకు క్షమాపణలు చెప్పారు.

More Telugu News