: 'నా గుండె బద్దలైంది'... ఇర్మా బీభత్సం గురించి చెబుతున్న న్యూస్ యాంకర్ వీడియో వైరల్

హరికేన్ ఇర్మా ప్రభావం ఫ్లోరిడాపై ఇంకా కొనసాగుతోంది. పలు టీవీ చానళ్లు మిగతా అన్ని వార్తలనూ పక్కనపెట్టి ఇర్మా విలయానికే పెద్ద పీట వేస్తున్నాయి. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, తుపాను గాలులు కదులుతున్న తీరుపై వివరాలు అందిస్తున్నాయి. నైరుతి ఫ్లోరిడాను ఇర్మా సమీపించిన వేళ వచ్చిన వీడియోలను, రాడార్ ఇమేజ్ లను చూపిస్తున్న ఓ టీవీ చానల్ యాంకర్ వార్తలు చదువుతూ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

"ఇది నమ్మశక్యంగా లేదు. నేనీ మాటలు అంటున్నానంటే, జరుగుతున్నదేంటో నేను నమ్ముతున్నాను. కేప్ కోరల్ లోని పార్క్ వే ప్రాంతంలో ఎన్ని ఇళ్లు మిగిలాయో తెలుసా? కేప్ కోరల్ వాయవ్య ప్రాంతం మరింత బీభత్సకరంగా మారింది. 6 నుంచి 9 అడుగుల ఎత్తయిన అలలు విరుచుకుపడుతున్నాయి. ఈ సమయంలో అక్కడ చాలా బీభత్సం జరుగుతోంది" అంటూ వార్తలను వివరించింది. జరుగుతున్నది చూస్తుంటే తన హృదయం బద్ధలైందని చెబుతూ ఇర్మా శాటిలైట్ ఇమేజ్ లో ఎరుపు రంగు ప్రాంతాన్ని చూపుతూ, ఇక్కడంతా ఉద్ధృతమైన గాలులు, నీటితో నిండిపోయిందని, ఓ ద్వీపం మొత్తాన్నీ సముద్రం ముంచెత్తిందని చెప్పింది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News