: రాఫెల్ నాదల్ వశమైన 16వ గ్రాండ్ స్లామ్ టైటిల్!

అనుకున్నదే జరిగింది. స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ కెరీర్ లో 16వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకున్నాడు. న్యూయార్క్ లో జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల చాంపియన్ షిప్ పోటీలో కెవిన్ ఆండర్సన్ ను చిత్తు చిత్తుగా ఓడించాడు. ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయిన కెవిన్ ను 6-3, 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో రెండు గంటల సమయంలోనే విజయం నాదల్ ను వరించింది. నాదల్ ధాటికి ఆండర్సన్ ఏ దశలోనూ నిలువలేకపోయాడు.

ఈ టోర్నీలో గెలిచిన నాదల్ కు రూ. 23.61 కోట్లు, ఫైనల్ వరకూ చేరిన ఆండర్సన్ కు రూ. 11.64 కోట్లు ప్రైజ్ మనీగా లభించింది. ఈ సంవత్సరం రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నాదల్ వశమైన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా గాయాల కారణంతో మైదానంలో రాణించడంలో విఫలమవుతూ వచ్చిన నాదల్, ఈ సీజన్ లో మాత్రం ఉత్సాహంగా కొనసాగుతుండటం గమనార్హం. ఇక పురుషుల సింగిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఆటగాడిగా 19 టైటిల్స్ తో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అగ్రస్థానంలో ఉండగా, అతని తరువాత 16 టైటిల్స్ తో నాదల్ నిలిచాడు. వీరిద్దరి తరువాత  పీట్‌ సంప్రాస్‌ (14), జొకొవిచ్ (12), ఎమర్సన్‌ (12)లు టాప్-5లో ఉన్నారు.

More Telugu News