: ఇర్మా ఎఫెక్ట్: ధ్వంసమైన జైలు.. పారిపోయిన ఖైదీలు.. బోలెడన్ని వింతలు!

అమెరికాపై విరుచుకుపడిన ఇర్మా తుపాను అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని బీభత్సం సృష్టిస్తోంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేవుడిని ప్రార్థిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ‘ఇర్మా’  ఖైదీలకు మాత్రం చెప్పలేనంత మేలు చేసింది. వందమందికిపైగా ఖైదీలకు విముక్తి ప్రసాదించింది. అట్లాంటిక్ సముద్రంలోని బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్‌లో ఉన్న జైలు పైభాగం ఇర్మా దెబ్బకు ధ్వంసమైంది. దీంతో దొరికిందే సందని సంబరపడిన ఖైదీలు వెంటనే జైలు నుంచి పరారయ్యారు. వారిని నిలువరించడం అక్కడి గార్డులకు కష్టతరంగా మారడంతో చేష్టలుడిగి చూస్తుండిపోయారు.

మరోవైపు ఇర్మా కారణంగా ప్రజలు ఫ్లోరిడా నుంచి తరలిపోతుంటే ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ ఒంటరిగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫోన్ ద్వారా వైద్యులు అందించిన సూచలన మేరకు ఆమె బిడ్డను ప్రసవించింది. దీంతో ఇప్పుడా బేబీ ‘ఇర్మా బేబీ’ అయిపోయింది.
 
ఫ్లోరిడాలోని మన్రో కౌంటీ జైలులో ఉన్న 426 మంది ఖైదీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జైలు ఖాళీగా ఉండడంతో సమీపంలోని జూలోని జంతువులను జైలుకు తరలించారు. దీంతో ఇప్పుడా జైలు గదులు గుర్రాలు, మేకలు, పక్షులు, ఇతర జంతువులతో నిండుగా ఉన్నాయి.

More Telugu News