raviteja: 'రాజా ది గ్రేట్'కి యాక్షన్ దృశ్యాల రీ షూట్!

రవితేజ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' రూపొందుతోంది. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రవితేజ చూపులేని వ్యక్తిగా ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం యాక్షన్ ఎపిసోడ్స్ ను రెండుసార్లు షూట్ చేసినా రవితేజ సంతృప్తిని వ్యక్తం చేయలేదట.

 దాంతో బాలీవుడ్ నుంచి వేరే యాక్షన్ కొరియోగ్రాఫర్ ను రప్పించి, ఫైట్స్ ను ఆయనతో డిజైన్ చేయించారట. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. రీ షూట్ కారణంగా ఖర్చు ఎక్కువైనా .. అనిల్ రావిపూడిపై గల నమ్మకంతో దిల్ రాజు వెనుకాడలేదట. మెహ్రీన్ కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, చిన్నప్పటి రవితేజగా ఆయన తనయుడు 'మహాధన్' నటిస్తుండటం విశేషం. అక్టోబర్ రెండవ వారంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.    

More Telugu News