: భార్యతో భర్త మాట్లాడకపోవడం హింస కిందకు రాదు.. కొత్త పెళ్లికూతురి పిటిషన్‌పై సుప్రీం కీలక తీర్పు

భర్త తనతో మాట్లాడకుండా హింసిస్తున్నాడంటూ ఓ భార్య వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భార్యతో భర్త మాట్లాడనంత మాత్రాన అది హింస కిందకు రాదని తేల్చి చెప్పింది. పెళ్లయి అత్త గారింటికి వెళ్లిన తనతో తొలి 20 రోజులు ఎవరూ మాట్లాడలేదని కొత్త పెళ్లికూతురు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతేకాక తమ పెళ్లి సంపూర్ణంగా జరగలేదని భర్త ఆరోపిస్తున్నాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇది తనను హింసించడం కిందికే వస్తుందని పేర్కొన్న ఆమె తనను తిరిగి తల్లిగారింటికి వెళ్లిపొమ్మని బలవంతం చేస్తున్నాడని ఆరోపించింది.

వివాహ సమయంలో రూ.15 లక్షలు ఖర్చుపెట్టామని, రూ.20 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కూడా ఇచ్చామని, అయినా అత్తవారింట్లో ఎవరూ తనతో మాట్లాడడం లేదని తన పిటిషన్‌లో పేర్కొంది. ఆమె పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు భర్త మాట్లాడకపోవడం హింస కిందకు రాదని తీర్పు చెప్పింది.  కాగా, బాధితురాలు తొలుత హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

More Telugu News