: చైనా దిగుమతులపై అదనపు పన్ను విధించిన భారత్!

దేశీయ స్టీల్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ తయారీదారులకు ప్రయోజనం కలిగేలా కేంద్ర ప్ర‌భుత్వం మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. చైనా నుంచి దిగుమ‌తి అవుతున్న చౌక ఉత్ప‌త్తులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా చైనా నుంచి దిగుమతి అయ్యే కొన్ని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఉత్పత్తులపై అదనపు దిగుమతి పన్నును విధించింది. చైనాతో పాటు జపాన్‌, దక్షిణ కొరియాల నుంచి స్టీల్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ దిగుమతులపై కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పటికే యాంటీ డం‍పింగ్‌ సుంకాల‌ను కూడా విధించింది. చైనా నుంచి అధికంగా దిగుమ‌తి అవుతోన్న స్టీల్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ దిగుమతుల కార‌ణంగా దేశీయ పరిశ్రమ సంక్షోభం ఎదుర్కొంటోంద‌ని వివ‌రించింది.

More Telugu News