vijay devarakonda: విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ మూవీ!
'అర్జున్ రెడ్డి' సినిమా విడుదలకి ముందే విజయ్ దేవరకొండ నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టాడు. పరశురామ్ దర్శకత్వంలో చేసే సినిమా సెట్స్ పై ఉండగా, మిగతా సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో దర్శకుడికి కూడా విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు .. కుటుంబ కథా చిత్రాలను ఎక్కువగా తెరకెక్కించే క్రాంతిమాధవ్.
ఆయన పేరు వినగానే 'ఓనమాలు' ..మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆయన తాజా చిత్రంగా 'ఉంగరాల రాంబాబు' ఈ నెల 15న విడుదల కానుంది. ఆ తరువాత సినిమా విజయ్ దేవరకొండతో ఉండనుందట. ఒక అందమైన ప్రేమకథగా ఈ సినిమా ఉంటుందనీ, ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. దీనిని బట్టి పాత ప్లానింగ్ లో విజయ్ దేవరకొండ మార్పులు చేసి ఉంటాడనే విషయం అర్థమవుతోంది.