sadha: వేశ్య పాత్రలో సీనియర్ హీరోయిన్!

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా 'సదా'కి మంచి గుర్తింపు వుంది. అలాంటి సదాకి కొంత కాలంగా ఈ రెండు భాషల్లోను అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఆమె 'టార్చ్ లైట్' అనే తమిళ సినిమా చేయడానికి అంగీకరించింది. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనుంది. అందమైన కలలతో .. ఆశలతో .. ఆశయాలతో వున్న ఓ అమ్మాయి, ఎలాంటి పరిస్థితుల్లో వేశ్యగా మారిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

 దర్శకుడు అబ్దుల్ మజీద్ తన దగ్గరికి వచ్చి .. ఒక వేశ్య చుట్టూ తిరిగే కథ అని చెప్పినప్పుడు చేయకూడదని అనుకున్నాననీ, కానీ ఆ తరువాత ఆయన కథ చెబుతుంటే కన్నీళ్లు వచ్చాయని సదా అంది. అందుకే ఈ సినిమాను అంగీకరించానని చెప్పింది. చాలామంది కథానాయికలు ఆసక్తి చూపని ఈ పాత్ర, సదాకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'తిరునల్వేలి' పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.    

More Telugu News